News March 20, 2024
పరీక్షలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్
AP: ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. మే 13న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 16కు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ నిర్వహిస్తారు.
Similar News
News November 25, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.
News November 25, 2024
1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఎన్ని లీటర్లో తెలుసా?
అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారెల్ ఆయిల్ 158.9 లీటర్లతో సమానం. ముడి చమురును రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్, LPG, లూబ్రికెంట్స్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు రూ.6వేలు ఉంది. దీని ప్రకారం పెట్రోల్ రేటు రూ.37 వరకు ఉండాలి. కానీ రిఫైన్, రవాణా ఛార్జీలు, పన్నులు, కమీషన్లతో రేటు రూ.110గా ఉంది.
News November 25, 2024
డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు
AP: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా DEC 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, మండల స్థాయిలో సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించనుంది.