News March 20, 2024
పరీక్షలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్
AP: ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. మే 13న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 16కు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ నిర్వహిస్తారు.
Similar News
News September 19, 2024
ALERT: గోధుమ పిండి వాడుతున్నారా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్‌లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.
News September 19, 2024
యువ CA మృతిపై కేంద్రం విచారణ
ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.
News September 19, 2024
అట్లీతో తప్పకుండా సినిమా చేస్తా: NTR
‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీతో తీసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘అట్లీ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారు. రొమాంటిక్ కామెడీ స్టోరీని కూడా డిస్కస్ చేశాం. తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ, తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా తీస్తాం. ఆయన తీసిన రాజా-రాణి అంటే నాకెంతో ఇష్టం’ అని ఎన్టీఆర్ తెలిపారు.