News February 17, 2025
బంగ్లా విదేశాంగ సలహాదారుతో జైశంకర్ భేటీ

బంగ్లా విదేశాంగ సలహాదారు తౌహిద్ హొస్సేన్‌తో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా భేటీ అయ్యారు. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి మా భేటీలో చర్చించాం. అదే విధంగా BIMSTEC గురించీ మాట్లాడుకున్నాం’ అని ట్విటర్లో వెల్లడించారు. బంగ్లా, భారత్, శ్రీలంక థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్ దేశాల మధ్య పలు రంగాల్లో సహకారం కోసం ఏర్పాటు చేసిందే BIMSTEC. ఈ ఏడాది సదస్సుకు బంగ్లా నేతృత్వం వహించనుంది.
Similar News
News April 19, 2026
ఆ జట్ల మధ్యే 13 IPL ట్రోఫీలు.. కానీ!

ముంబై, చెన్నై, కోల్‌కతా జట్ల ప్రదర్శన వాటి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ మూడు జట్లే ఏకంగా 13 IPL ట్రోఫీలు(MI-5, CSK-5, KKR-3) గెలవగా ప్రస్తుత సీజన్‌లో తేలిపోయాయి. 6 మ్యాచుల్లో 2 విజయాలతో చెన్నై PTలో 7వ స్థానంలో ఉంది. ఇక 5 మ్యాచుల్లో 1 గెలుపుతో MI 9, 6 మ్యాచుల్లో 5 ఓటమి, ఒక డ్రాతో KKR చివరి స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లలోనూ కెప్టెన్లు రాణించకపోవడం మైనస్. ఇకనైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News April 19, 2026
ఆ ఊళ్లో హనుమంతుడి పేరెత్తరు..

ఉత్తరాఖండ్ ద్రోణగిరిలో హనుమంతుడిని పూజించరు. రామాయణ కాలంలో లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని కోసం వచ్చిన హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని తీసుకెళ్లారని గ్రామస్థుల నమ్మకం. గ్రామదేవత అనుమతి లేకుండా కొండను తీసుకెళ్లడంతో తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగిందని వారు భావిస్తారు. అందుకే ఈ ఊరిలో హనుమంతుడి గుళ్లు, జెండాలు కనిపించవు. అయితే వారికి హనుమపై ద్వేషం లేదు. కానీ అనుమతి అడగకపోవడం సరైనది కాదని నమ్ముతారు.
News April 19, 2026
RTC ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుందా?

TG: ఈ నెల 22 నుంచి RTC ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో జీతాల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021, 2025 వేతన సవరణలు పెండింగ్‌లో ఉండగా, ఒక విడత వేతన సవరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 లేదా 8% ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక నేతలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను 10% మించకుండా ఖరారు చేసే ఛాన్సుందని, మరో వేతన సవరణపైనా హామీ ఉండొచ్చని సమాచారం.


