News March 20, 2024
షమీ స్థానంలో సందీప్, మధుశంక స్థానంలో మఫకా

IPL: గాయపడ్డ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్‌ను తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన సందీప్.. ఇది వరకు ఆర్సీబీ, కేకేఆర్, ముంబై తరఫున ఆడారు. ఇక ముంబై పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫకాను టీంలోకి తీసుకున్నారు. మఫకా అండర్-19 WCలో అత్యధిక వికెట్లు తీశారు.
Similar News
News January 14, 2026
గిల్ మినహా టాపార్డర్ విఫలం

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ గిల్(56) మినహా రోహిత్(24), కోహ్లీ(23), అయ్యర్(8) నిరాశపర్చారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు నమోదు చేసింది. 99 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోగా 19 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. NZ బౌలర్ క్లర్క్ 3 వికెట్లతో చెలరేగారు. 26 ఓవర్లో భారత్ స్కోరు 125-4.
News January 14, 2026
మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.
News January 14, 2026
ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<


