News February 17, 2025

విజయవాడలో నేడు క్యాట్ బెంచ్ ప్రారంభం

image

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సర్క్యూట్ బెంచ్ నేడు విజయవాడలో ప్రారంభం కానుంది. క్యాట్ ఛైర్మన్ జస్టిస్ రంజిత్ వీ మోరే వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఏపీలో ఇప్పటివరకు సర్క్యూట్ బెంచ్ లేకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసు అంశాల్లో ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ లేదా HYD క్యాట్‌ను ఆశ్రయిస్తూ వచ్చారు. ఇకపై వారి కష్టాలు తీరనున్నాయి.

Similar News

News November 11, 2025

కుందేళ్ల పెంపకం.. మేలైన జాతులు ఏవి?

image

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.

News November 11, 2025

బిహార్‌ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్‌లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

News November 11, 2025

మౌలానా అజాద్ NITలో ఉద్యోగాలు

image

మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<>MANIT<<>>) భోపాల్‌లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 17వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్‌తో పాటు సంబంధిత విభాగంలో PhD చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్‌సైట్: https://www.manit.ac.in