News February 17, 2025
PAK links: గౌరవ్ గొగోయ్‌ను ట్రాప్ చేశారేమోనన్న హిమంత

భారత వ్యతిరేక అతిపెద్ద కుట్రలో కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ బహుశా బ్లాక్మెయిల్ లేదా ట్రాప్ అయ్యారేమోనని అస్సాం CM హిమంత అన్నారు. దర్యాప్తునకు ఆదేశించే ముందు మాట్లాడారు. ‘ఇది కేవలం గౌరవ్ గొగోయ్ అంశం కాదు. దీనివెనక భారత వ్యతిరేక శక్తులున్నట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఎకోసిస్టమ్‌లో గౌరవ్ ఒక పావు మాత్రమే. సూత్రదారి కాదు. ప్రస్తుతానికి మేం అతడిని నిందితుడిగా కాకుండా జాలితో చూస్తున్నాం’ అన్నారు.
Similar News
News January 11, 2026
VKB: పండుగ.. మీ పిల్లలు పైలం!

సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. తెగిపోయిన వాటికోసం పరుగులు పెడుతుంటారు. రోడ్లు, గుంతలు గమనించకుండా పతంగులను పట్టుకోవాలనే ఆత్రుతలో ప్రమాదాలకు ఎదురెళ్తారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్లు ఎగురవేయడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
✦ పేరెంట్స్ పిల్లలపై నజరేయండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోం
News January 11, 2026
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఉద్యోగాలు

ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 45 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JSOకు నెలకు రూ.68,697, JSAకు రూ.42,632 చెల్లిస్తారు. https://fsl.delhi.gov.in
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.


