News February 17, 2025

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు సర్కారు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Similar News

News February 6, 2026

TGకి రూ.12 లక్షల కోట్లు ఇచ్చాం: ప్రహ్లాద్ జోషి

image

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన HYDలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో TGకి ₹12 లక్షల కోట్లు ఇచ్చాం. వ్యవసాయం, మౌలిక వసతులు, హైవేల నిర్మాణానికి ఎక్కువగా వెచ్చించాం. పన్నుల వాటాను 32 నుంచి 41%కి పెంచి ఇప్పటి వరకు ₹2.52 లక్షల కోట్లు ఇచ్చాం. UPA హయాంలో ₹60వేల కోట్లు కూడా ఇవ్వలేదు’ అని విమర్శించారు.

News February 6, 2026

బాలికల మిస్సింగ్ కేసులు పెరగలేదు: ఢిల్లీ పోలీసులు

image

ఢిల్లీలో బాలికల మిస్సింగ్ కేసులు పెరిగాయన్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. పెయిడ్ ప్రమోషన్లతో కొందరు ఈ అంశానికి హైప్ తీసుకొస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా JAN 1 నుంచి 15 మధ్య 509 మంది బాలికలు, మహిళలు తప్పిపోయినట్లు పోలీసుల డేటా వెల్లడించిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే 2025తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని, కేసులు పెరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

News February 6, 2026

సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

image

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.