News February 17, 2025
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు సర్కారు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Similar News
News April 17, 2026
ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.