News February 17, 2025

వంశీ కేసు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

image

AP: మాజీ MLA వంశీని 10రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు, బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్లపై విజయవాడ SC, ST ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విని వాటి విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే వంశీకి ఇంటి నుంచి ఫుడ్ అందించాలన్న పిటిషన్‌నూ విచారించి ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. అటు గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను కోర్టుకు తెచ్చి వాంగ్మూలం నమోదు చేశారు.

Similar News

News November 7, 2025

ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

image

HYDలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకానుంది. చారిత్రక లార్డ్స్, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి దిగ్గజ స్టేడియాలకు తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీలో 2 ఏళ్లలో దీన్ని తీర్చిదిద్దాలని CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు ‘వే2న్యూస్’కు అధికారులు తెలిపారు. దీనిపై అధ్యయనానికి మాజీ క్రికెటర్లతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రవాణా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని RR(D) కందుకూరులో ఏర్పాటుచేసే అవకాశముంది.

News November 7, 2025

Fact Check: పాత ₹500, ₹1,000 నోట్లు మార్చుకోవచ్చా?

image

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.

News November 7, 2025

15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

image

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.