News February 17, 2025
వంశీ కేసు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

AP: మాజీ MLA వంశీని 10రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు, బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్లపై విజయవాడ SC, ST ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విని వాటి విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే వంశీకి ఇంటి నుంచి ఫుడ్ అందించాలన్న పిటిషన్‌నూ విచారించి ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. అటు గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను కోర్టుకు తెచ్చి వాంగ్మూలం నమోదు చేశారు.
Similar News
News April 14, 2026
ఇప్పుడు రాజకీయంగానూ దెబ్బతింటాం: రేవంత్

TG: ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక వివక్ష ఎదుర్కొంటున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్, UP నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం కంటే వాళ్లు పొందేదే ఎక్కువ. కానీ నా రాష్ట్రం తెలంగాణ పొందే దాని కంటే ఇచ్చేదే ఎక్కువ. ఇప్పుడు LS సీట్లు పెంచితే రాజకీయంగానూ దెబ్బతింటాం. ఎక్కువ జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు సరికాదు’ అని మోదీకి లేఖ రాశారు.
News April 14, 2026
ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్‌తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.
News April 14, 2026
పిల్లులు సగం ఆహారమే ఎందుకు తింటాయి?

సాధారణంగా పెంపుడు పిల్లులు పెట్టిన ఆహారంలో సగమే తిని మిగతాది వదిలేస్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఆహారం తాలూకు వాసన వాటికి బోర్ కొట్టడమేనని పరిశోధనల్లో తేలింది. ఎంత మంచి ఆహారం అయినా సరే రోజూ అదే పెడితే పిల్లులు క్రమంగా దాన్ని తినడం తగ్గించేస్తాయట. వేర్వేరు రకాల ఆహారం పెడుతూ ఉంటే అవి తినేందుకు ఆసక్తి చూపిస్తాయని.. ఆకలి కంటే కూడా వాసనకే ప్రాధాన్యం ఇస్తాయని రీసెర్చ్ పేర్కొంది.


