News February 17, 2025
స్కూళ్ల కోసం రూ.2000 కోట్లు ఇస్తాం: అదానీ గ్రూప్

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్‌మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.
Similar News
News April 19, 2026
రాష్ట్రంలో భానుడి భగభగ.. ADBలో 44.3 డిగ్రీలు

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్‌లో 43.1, మహబూబ్‌నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.
News April 19, 2026
చిన్న సినిమా సంచలనం.. రూ.10 కోట్లతో తీస్తే రూ.200 కోట్లు!

మలయాళ మూవీ ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 17 రోజుల్లోనే రూ.200+ కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కూల్లో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్లు జీవితంలో ఎలా సెటిలయ్యారనేదే కథ. ఈ సినిమా తెలుగులో వాలా-2 పేరుతో ఈ నెల 24న రిలీజవనుంది. రేపు ట్రైలర్ విడుదల కానుంది.
News April 19, 2026
గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.


