News February 18, 2025

నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

image

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

Similar News

News February 21, 2025

వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన కస్టడీ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీ, హెల్త్ పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

News February 21, 2025

టెస్లా కారు రూ.21 లక్షలకు వస్తే మన కంపెనీలకు దెబ్బే.. కానీ!

image

ఇండియాలో టెస్లా కార్లు రాబోతున్నాయని, వాటి ధర రూ.21 లక్షలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ కంపెనీలో రూ.21 లక్షల ప్రైస్ రేంజ్‌లో కారే లేదు. మినిమమ్ ధర రూ.34 లక్షలుగా ఉంది. పన్నులతో రూ.40 లక్షల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ రూ.21 లక్షల్లో తీసుకొస్తే దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్రా ఈవీ మార్కెట్లకు పెద్ద దెబ్బే పడనుంది. రూ.40 లక్షలు, ఆపై ఉంటే లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది. పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.

News February 21, 2025

ఆందోళన విరమించిన TTD ఉద్యోగులు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి బాలాజీ సింగ్‌ను బోర్డు సభ్యుడు <<15507901>>నరేశ్<<>> దూషించడంతో 2 రోజులుగా TTD ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెర పడింది. దూషణ విషయంపై టీటీడీ ఉద్యోగులతో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు ఇవాళ భేటీ అయ్యారు. బాలాజీసింగ్ విషయంలో తప్పు జరిగిందని నరేశ్ ఒప్పుకొని, క్షమాపణలు చెప్పినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు వివరించారు.

error: Content is protected !!