News February 18, 2025

నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

image

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

Similar News

News March 23, 2025

ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

image

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.

News March 23, 2025

పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

image

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్‌ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.

News March 23, 2025

కూటమి సర్కార్ నాపై కక్షగట్టింది: విడదల రజిని

image

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

error: Content is protected !!