News February 18, 2025

పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

image

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్‌ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.

Similar News

News February 3, 2026

అసభ్యంగా తాకాడు.. చెంపపై ఒక్కటిచ్చా: నటి రేవతి సెన్సేషనల్ కామెంట్స్

image

80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘11వ తరగతి చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు. అస్సలు భయపడకుండా వెంటనే అతణ్ని అందరి ముందే చెంపపై కొట్టా. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు.

News February 3, 2026

VASTHU: చిన్న ఇల్లే చింతలేని ఇల్లు

image

పూర్వం ఉమ్మడి కుటుంబాలతో ఇళ్లు కళకళలాడేవి. కానీ నేడు పిల్లలు ఉద్యోగరీత్యా దూరమవ్వడంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ సులభంగా ఉండే చిన్న ఇల్లే స్వర్గమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. ‘ఓ పడకగది, వంటగది, హాల్‌తో కూడిన చిన్న ఇల్లు ఒంటరిగా ఉండేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఆ ఇల్లు వాస్తు ప్రకారం తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 3, 2026

మైతేయి-కుకీ హింస.. CM రిజైన్.. మణిపుర్‌లో ఏం జరిగింది?

image

మణిపుర్‌లో 2023 మేలో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 250 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాన్ని కంట్రోల్ చేయలేక, సొంత పార్టీ నేతల విమర్శల మధ్య 2025 Feb 9న అప్పటి CM బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో 2025 ఫిబ్రవరి 13 నుంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఏడాది తర్వాత నేడు BJP <<19041653>>కొత్త సీఎం<<>>ను ఎన్నుకుంది.