News February 18, 2025
పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.
Similar News
News March 27, 2025
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News March 27, 2025
జియో, ఎయిర్‌టెల్, Vi సిమ్‌లు వాడుతున్నారా?

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం త్వరలో ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ సదుపాయాన్ని తీసుకురానున్నాయి. ఇది ఆయా యూజర్లకు కాల్ చేసిన అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు TRAI దీనిని గతంలోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు Jio, Airtel, Vodafone-Idea(Vi) సిద్ధమయ్యాయి. KYC డాక్యుమెంట్ ఆధారంగా ఈ పేర్లను చూపించనున్నాయి.