News February 18, 2025
మహిళలు, BC, SC, STలకు శుభవార్త

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.
Similar News
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News January 10, 2026
కోటీశ్వరులు పెరిగారు!

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.
News January 10, 2026
వంటింటి చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు మూకుడులో నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* గారెలు, వడలు చేసే పిండిలో కొద్దిగా సేమియాను పొడిగా చేసి కలిపితే నూనె లాగవు. కరకరలాడతాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* సమోసా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కలిపితే సరిపోతుంది.


