News February 18, 2025
మహిళలు, BC, SC, STలకు శుభవార్త

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.
Similar News
News March 26, 2025
కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
News March 26, 2025
Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్‌ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.
News March 26, 2025
చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.