News February 18, 2025
సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
Similar News
News November 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 4, 2025
శుభ సమయం (04-11-2025) మంగళవారం

✒ తిథి: శుక్ల చతుర్దశి రా.9.38 వరకు
✒ నక్షత్రం: రేవతి ఉ.11.43 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: ఉ.9.22-ఉ.10.52, మ.3.30-సా.5.00
News November 4, 2025
TODAY HEADLINES

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్‌లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్‌ల బహుమతి


