News February 18, 2025
సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
Similar News
News March 28, 2025
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం
News March 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 28, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.41 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.