News March 21, 2024

సచివాలయంలోకి ప్రజలకు నో ఎంట్రీ

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకు ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీంతో పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలు, సందర్శకులను సచివాలయంలోకి అనుమతించడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ రాకతో పోలీస్, ఈసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలించే నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నారు.

Similar News

News November 5, 2025

పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

image

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

News November 5, 2025

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

image

<>పంజాబ్<<>> నేషనల్ బ్యాంక్ 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: pnb.bank.in/

News November 5, 2025

ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

image

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.