News March 21, 2024

సచివాలయంలోకి ప్రజలకు నో ఎంట్రీ

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకు ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీంతో పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలు, సందర్శకులను సచివాలయంలోకి అనుమతించడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ రాకతో పోలీస్, ఈసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలించే నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

GNT: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2027 పద్మ పురస్కారాలకు గానూ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎస్‌వో అఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగలవారు తమ పత్రాలను వర్డ్, పీడీఎఫ్ ఫార్మాట్‌లో మే 15లోపు sportsinap@gmail.comకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు awards.gov.in చూడొచ్చు. ఎంపిక చేసిన అర్హుల జాబితాను కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.

News April 17, 2026

SHOCKING: ‘జైలర్-2’ కీలక సీన్ లీక్!

image

మొన్న విజయ్ <<19615293>>‘జననాయగన్’<<>>.. నేడు రజినీకాంత్ ‘జైలర్-2’. పైరసీ భూతం కోలీవుడ్ పెద్ద సినిమాలను వెంటాడుతోంది. నెల్సన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘జైలర్-2’ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియో క్లిప్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ సీరియస్ అయింది. లీకైన దృశ్యాలను ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సన్ పిక్చర్స్ హెచ్చరించింది.

News April 17, 2026

ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

image

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.