News February 18, 2025

రజినీకాంత్‌తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదే మరో సాంగ్ రాబోతుందని సినీవర్గాలు తెలిపాయి. లోకేశ్ కనగరాజ్- రజినీ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ మూవీలో ‘కావాలయ్యా’ లాంటి స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే, ఇందులో తమన్నాకు బదులు బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 13, 2025

ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News March 13, 2025

త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

image

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.

News March 13, 2025

రోజూ చికెన్ తింటున్నారా?

image

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

error: Content is protected !!