News February 18, 2025

రజినీకాంత్‌తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదే మరో సాంగ్ రాబోతుందని సినీవర్గాలు తెలిపాయి. లోకేశ్ కనగరాజ్- రజినీ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ మూవీలో ‘కావాలయ్యా’ లాంటి స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే, ఇందులో తమన్నాకు బదులు బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 15, 2026

మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్‌కు లేదు: ఖర్గే

image

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్‌ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 15, 2026

పెద్ది సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాలతో జూన్ నెలకు పోస్ట్‌పోన్ అయింది.

News April 15, 2026

IPL చరిత్రలో అదిరిపోయే మ్యాచ్.. గుర్తుందా?

image

ఏడాది కిందట ఇదే రోజు IPLలో అరుదైన రికార్డ్ నమోదైంది. KKR, PBKS మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. తొలుత పంజాబ్ 111 పరుగులే చేసింది. దీంతో డికాక్, నరైన్, రింకూ, రస్సెల్ తదితరులతో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న KKR ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ PBKS అద్భుతం చేసింది. చాహల్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీయడంతో 95 రన్స్‌కే ఆలౌటైంది. IPL చరిత్రలో ఇదే లోయెస్ట్ స్కోర్ డిఫెండింగ్ మ్యాచ్ కావడం విశేషం.