News February 19, 2025
కొత్త రేషన్ కార్డులపై UPDATE!

TG ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, HYDలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News January 12, 2026
అక్షర యోధుడు అలిశెట్టి

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).
News January 12, 2026
ICMR-NIIRNCDలో 45 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 12, 2026
అత్తారింటికి కొత్తగా వెళ్తున్న కోడలు పాటించాల్సిన నియమాలు..

నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి 6 నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో కోడలు ఓర్పుతో ఉండాలి. కుటుంబీకుల అలవాట్లను గమనిస్తూ వారితో మమేకం కావాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఇష్టదైవానికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఈ నియమం బాధ్యతలకే పరిమితం కాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, సామరస్యంగా జీవించడమే ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.


