News February 19, 2025
కొత్త రేషన్ కార్డులపై UPDATE!

TG ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, HYDలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News April 19, 2026
HYD: వైభవంగా గురు తేగ్ బహదూర్ ప్రకాశ్ పురబ్

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్ బహదూర్ సాహెబ్ జీ 405వ ప్రకాశ్ పురబ్ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్ దివాన్’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్ సాహెబ్ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
News April 19, 2026
అభిషేక్, నితీశ్ కుమార్‌ల ఫ్యామిలీలను చూశారా?

నిన్న ఉప్పల్ స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో SRH ప్లేయర్లైన అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులు ఎంజాయ్ చేశారు. వారి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. నితీశ్ సోదరి తేజస్వీ రెడ్డి ఉజ్బెకిస్థాన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. అటు అభిషేక్ సోదరి కోమల్ శర్మ ఫిజియోథెరపిస్ట్. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.