News March 21, 2024

టేకులపల్లిలో 3 మద్యం దుకాణాల లూటీ

image

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ఉన్న 3 మద్యం దుకాణాలు లూటీకి గురయ్యాయి. అధిక ధరకు మద్యం అమ్ముతున్నారనే కారణంతో ప్రజలు ఈ దుకాణాలను లూటీ చేశారు. 3 షాపుల యజమానులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన కస్టమర్లు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రూ.22 లక్షల విలువైన మద్యం మాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

image

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

image

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.

News October 26, 2025

‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

image

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.