News February 19, 2025
పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.
Similar News
News January 7, 2026
ఫ్యామిలీతో జల విహారం చేస్తారా?

APలోనే తొలిసారి ఎన్టీఆర్(D) ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కేరళ తరహా ఫ్లోటెడ్ బోట్లను అధికారులు ఏర్పాటుచేశారు. రేపు సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రి, నెల్లూరు, కడప తదితర 11 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బోట్లలో ఒక బెడ్, టీవీ, కుర్చీలు, వెస్ట్రన్ టాయిలెట్, హాల్ సౌకర్యాలుంటాయి. 24 గంటలపాటు ఫ్యామిలీతో జలవిహారం చేయొచ్చు. ధర రూ.8వేల వరకు ఉంటుంది.
News January 7, 2026
LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.
News January 7, 2026
ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం!

TG: రాష్ట్ర సాధన కోసం KCR స్థాపించిన TRSలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కవితకు ఆ పార్టీతో పూర్తిగా బంధం తెగిపోయింది. ఆమె MLC పదవి రాజీనామాకు మండలి ఛైర్మన్ <<18784326>>ఆమోదం<<>> తెలిపారు. తండ్రితో కలిసి ఉద్యమంలో పాల్గొన్న కవిత ఆ పార్టీపైనే ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది. పార్టీ తనను ఘోరంగా అవమానించిందంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.


