News March 21, 2024

మరో రెండేళ్లలో ఎస్-400 డెలివరీ పూర్తి

image

2026కల్లా రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.

Similar News

News October 28, 2025

ఇంటర్వ్యూతోనే NIRDPRలో ఉద్యోగాలు..

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: http://career.nirdpr.in

News October 28, 2025

రోజూ ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది: వైద్యులు

image

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్‌టాప్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.

News October 28, 2025

ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

image

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్‌ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.