News March 21, 2024
మరో రెండేళ్లలో ఎస్-400 డెలివరీ పూర్తి

2026కల్లా రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.
Similar News
News April 11, 2026
వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It
News April 11, 2026
చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.
News April 11, 2026
వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.


