News February 20, 2025
బాబర్ ఆజమ్ ఆటతీరుపై విమర్శలు

ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న జరిగిన PAKvNZ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఎదుట 321 పరుగుల లక్ష్యం ఉండగా బాబర్ 90 బంతులాడి 64 పరుగులు చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి చివరికి జట్టు ఓటమికి కారణమైందంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు. ఇటు భారత నెటిజన్లు బాబర్‌పై జోకులు పేలుస్తున్నారు.
Similar News
News November 4, 2025
‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.
News November 4, 2025
నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్‌ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
News November 4, 2025
నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.


