News February 20, 2025
బాబర్ ఆజమ్ ఆటతీరుపై విమర్శలు

ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న జరిగిన PAKvNZ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఎదుట 321 పరుగుల లక్ష్యం ఉండగా బాబర్ 90 బంతులాడి 64 పరుగులు చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి చివరికి జట్టు ఓటమికి కారణమైందంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు. ఇటు భారత నెటిజన్లు బాబర్‌పై జోకులు పేలుస్తున్నారు.
Similar News
News July 6, 2025
HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

సెకండ్ హ్యాండ్లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.