News March 21, 2024

అరుణాచల్ భారత్‌దే.. అమెరికా స్పష్టీకరణ

image

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.

Similar News

News November 25, 2024

ఐశ్వర్యపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన అభిషేక్

image

త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో భార్య ఐశ్వర్యరాయ్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నా అంటే ఇంట్లో ఐశ్వర్య ఉందన్న ధైర్యమే. అందుకు నేను అదృష్టవంతుడిని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే వారికి పేరెంట్స్ ఇద్దరూ ఒక్కటే’ అని చెప్పారు.

News November 25, 2024

వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు?

image

TG: ₹లక్ష పైన విలువున్న టూవీలర్స్, ₹10 లక్షల పైన విలువున్న కార్లకు రోడ్డు ట్యాక్స్ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం కార్లకు 13-18%, టూవీలర్స్‌కు 9-12% ట్యాక్స్ శ్లాబులున్నాయి. గరిష్ఠంగా కేరళలో 21%, తమిళనాడులో 20% పన్ను ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ మేరకు ఇక్కడా రేట్లు సవరించాలని నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

News November 25, 2024

రోహిత్, అశ్విన్, షమీ లేకున్నా హిస్టారిక్ విన్

image

BGT తొలి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్, జడేజా, షమీ జట్టులో లేకపోయినా ప్రత్యర్థి భరతం పట్టింది. రన్స్‌ పరంగా (295) ఆసిస్‌పై టీమ్ ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2003లో ఆడిలైడ్, 2008లో పెర్త్‌ విజయాలతో పోలిస్తే ఈ గెలుపు మరపురానిది. తొలి మ్యాచ్‌లోనే కంగారు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన టీమ్‌ఇండియా ఆసిస్ మాజీ క్రికెటర్ల కలలను కల్లలు చేసింది.