News March 21, 2024
అరుణాచల్ భారత్‌దే.. అమెరికా స్పష్టీకరణ
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.
Similar News
News September 13, 2024
BREAKING: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ఉల్లి ఎగుమతులపై పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఆనియన్ ఎక్స్‌పోర్ట్స్‌పై నిషేధం ఎత్తివేయగా, ఇవాళ మినిమం ఎక్స్‌పోర్ట్ ప్రైజ్(MEP)ను కూడా తొలగించింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టన్ను ఉల్లి ధర కనీసం 550డాలర్లు(₹46,000)గా ఉంటేనే ఎగుమతికి అనుమతి ఉండేది. దీనిపై 40% సుంకం చెల్లించాల్సి వచ్చేది.
News September 13, 2024
కొందరు పోలీసుల తీరు మారడం లేదు: జనసేన
AP: ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారడం లేదని జనసేన ట్వీట్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమంలో వస్తున్నాయంది. గత ప్రభుత్వంలో YCP నేతల దౌర్జన్యాలకు సహకరించిన పోలీసుల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారంది. ఇప్పటికీ కొందరు పోలీసులు అదే తీరును కొనసాగిస్తున్నట్లు వారు వాపోయారని తెలిపింది.
News September 13, 2024
కోహ్లీతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.