News February 21, 2025
మా దేశం విశ్వసనీయత కోల్పోయింది: పాక్ ఆర్థిక మంత్రి

ఆర్థిక అస్థిరత్వం కారణంగా తమ దేశం విశ్వసనీయతను కోల్పోయిందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. ‘కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అత్యవసరంగా ఆర్థిక సంస్కరణల్ని అమలుచేయాలి. ప్రస్తుతానికి ఆర్థిక సాయంగా ADB నుంచి 500 మిలియన్ డాలర్లు, IMF నుంచి బిలియన్ డాలర్లు రానున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలే దేశ ఆర్థిక ప్రగతికి, స్థిరత్వానికి దోహదపడతాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 22, 2025
దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్

TG: దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని CM రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాహుల్ హామీ మేరకే కులగణన చేపట్టాం. BCల సంఖ్యపై గతంలో KCR కాకి లెక్కలు చెప్పారు. కానీ మేం అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించాం. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
News February 22, 2025
హోలీ పండుగపై కామెంట్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌పై కేసు

హోలీ పండుగపై బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ తక్కువ స్థాయి వారు(ఛప్రి) చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫరా వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించగా ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఫరాపై చర్యలు తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.
News February 22, 2025
GOLD: పెరుగుతూ పోతే కొనేదెలా!

బంగారం ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే తులం రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర పెరిగి, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.80,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,770లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.900 తగ్గి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.