News February 21, 2025
మా దేశం విశ్వసనీయత కోల్పోయింది: పాక్ ఆర్థిక మంత్రి

ఆర్థిక అస్థిరత్వం కారణంగా తమ దేశం విశ్వసనీయతను కోల్పోయిందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. ‘కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అత్యవసరంగా ఆర్థిక సంస్కరణల్ని అమలుచేయాలి. ప్రస్తుతానికి ఆర్థిక సాయంగా ADB నుంచి 500 మిలియన్ డాలర్లు, IMF నుంచి బిలియన్ డాలర్లు రానున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలే దేశ ఆర్థిక ప్రగతికి, స్థిరత్వానికి దోహదపడతాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 22, 2025
తొలి సినిమాకే ప్రెసిడెంట్ అవార్డు.. ప్రముఖ నటుడి మృతి

వెటరన్ యాక్టర్ రాకేశ్ పాండే (77) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో జుహూలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. థియేటర్ ఆర్టిస్టుగా విశేష అనుభవం గల ఆయన 1969లో బసు ఛటర్జీ తీసిన క్లాసిక్ ‘సారా ఆకాశ్’తో తెరంగేట్రం చేశారు. తన నటనతో మెప్పించి ప్రెసిడెంట్ అవార్డునూ పొందారు. సినిమాలే కాకుండా ఆయన ఛోటీ బాహు, దెహ్లీజ్, భారత్ ఏక్ ఖోజ్ వంటి TV షోల్లోనూ నటించారు. రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట.
News March 22, 2025
రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ వాకౌట్

TG: రుణమాఫీ విషయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం ఆ పార్టీ నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. రూ.2 లక్షలపైన ఉన్నవారు మిగతావి కడితే సరిపోతుందన్నారు. కానీ ఇప్పుడు రూ.2 లక్షలలోపు వారికే రుణమాఫీ అని బుకాయిస్తున్నారు. ఇందుకు నిరసనగానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.
News March 22, 2025
BREAKING: కాసేపట్లో భారీ వర్షం

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.