News February 21, 2025
నేటి నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

AP: దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. ఉత్సవాలకు హాజరుకావాలని పలువురు సీఎంలు, ప్రముఖ హీరోలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందజేశారు.
Similar News
News February 22, 2025
కాంగ్రెస్ ఓటుకు రూ.7వేలు ఇస్తోంది: బండి

TG: MLC ఎన్నికల వేళ ఓటుకు కాంగ్రెస్ రూ.7 వేలు పంచుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రూ.7వేలు కాదు రూ.10వేలు ఇచ్చినా గెలుపు BJPదే అని ధీమా వ్యక్తం చేశారు. MP ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్దమొత్తంలో డబ్బులు పంచినా తనను 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్ MLC అభ్యర్థి లేక రోడ్డుమీద పోయే వ్యక్తి మెడలో గంట కట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
News February 22, 2025
ఆప్ వింత.. లేని శాఖకు 20 నెలలుగా మినిస్టర్

పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో వింత ఘటన జరిగింది. లేని శాఖకు కుల్దీప్ సింగ్ 20 నెలలుగా మంత్రిగా ఉన్నారు. తాజాగా అసలు ఆ శాఖ మనుగడలో లేదని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తప్పు తెలుసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, కుల్దీప్‌సింగ్ 20 నెలలుగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్(ఉనికిలో లేనిది), NRI అఫైర్స్ శాఖలకు మంత్రిగా ఉండటం విశేషం. ఆప్ ప్రభుత్వం పాలనను జోక్‌లా మార్చిందని BJP మండిపడింది.
News February 22, 2025
కాంగ్రెస్‌లోనే కోనేరు కోనప్ప!

TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెనక్కితగ్గారు. కోనప్పను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి చర్చించి పలు హామీలు ఇవ్వడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎంతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అయితే నిన్న కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్నహరికృష్ణ(BSP)కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.