News February 21, 2025
నేటి నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

AP: దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. ఉత్సవాలకు హాజరుకావాలని పలువురు సీఎంలు, ప్రముఖ హీరోలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందజేశారు.
Similar News
News March 25, 2025
బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.
News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
News March 25, 2025
BSNL యూజర్లకు అలర్ట్

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.