News February 21, 2025

త్వరలో పబ్లిక్ ఇష్యూకు boAt

image

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ boAt లైఫ్‌స్టైల్ త్వరలో IPOకు వస్తున్నట్టు తెలిసింది. రూ.2000 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా FY26లో సెబీ వద్ద రహస్యంగా DRHP దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు CNBC TV18 పేర్కొంది. వాల్యుయేషన్‌ను $1.5B పైగా కోరుతోందని తెలిసింది. 2022లోనే పేపర్లు సబ్మిట్ చేసిన బోట్ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. PVT క్యాపిటల్ ద్వారా $60M సమీకరించింది.

Similar News

News January 18, 2026

వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

image

* BP, డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

News January 18, 2026

ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

image

ట్రంప్‌నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్‌ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్‌ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.

News January 18, 2026

ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.