News February 21, 2025
త్వరలో పబ్లిక్ ఇష్యూకు boAt

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ boAt లైఫ్‌స్టైల్ త్వరలో IPOకు వస్తున్నట్టు తెలిసింది. రూ.2000 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా FY26లో సెబీ వద్ద రహస్యంగా DRHP దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు CNBC TV18 పేర్కొంది. వాల్యుయేషన్‌ను $1.5B పైగా కోరుతోందని తెలిసింది. 2022లోనే పేపర్లు సబ్మిట్ చేసిన బోట్ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. PVT క్యాపిటల్ ద్వారా $60M సమీకరించింది.
Similar News
News March 27, 2025
పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.
News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
News March 27, 2025
హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.