News March 21, 2024

పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం: TDP

image

AP: ‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీ’నే అంటూ వైసీపీ చేసిన <<12895964>>విమర్శలకు<<>> తెలుగు దేశం Xలో కౌంటర్ ఇచ్చింది. ‘పవన్‌ను పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది.. అది పూడ్చుకో ముందు. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్’ అని మండిపడింది.

Similar News

News August 30, 2025

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..

image

సూర్యోదయానికి ముందు ముహూర్తం రౌద్రం. దానికి ముందు బ్రహ్మ ముహూర్తం. సులభంగా చెప్పాలంటే సూర్యుడు ఉదయించే గంటన్నర ముందు సమయం. ‘బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యంతో పాటు ధర్మాచరణకు ఇది సరైన సమయం అని అర్థం. శాస్త్రీయ కోణంలో చూస్తే.. భూ పరిబ్రమణంతో ముడిపడిన ఈ సమయంలో నిద్ర లేస్తే యాక్టివ్‌గా ఉంటాము. పక్షులు, పశువులు ఈ టైంలోనే మేల్కోవడం మనం గమనించవచ్చు.

News August 30, 2025

గ్రౌండ్‌లో వర్షం.. పిచ్ ఆరేందుకు మంట

image

కెనడాలో తడిసిన మైదానాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని టొరంటోలో ఉన్న నార్త్-వెస్ట్ గ్రౌండ్‌లో స్కాట్లాండ్, నమీబియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వాన అంతరాయం కలిగించింది. గ్రౌండ్ ఎంతకూ ఆరకపోవడంతో సిబ్బంది భిన్నంగా ఆలోచించి మంట పెట్టారు. చివరకు కట్ ఆఫ్ సమయానికి కూడా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

News August 30, 2025

హిందూ ధర్మంలో సంస్కారాలు ఏవి..?

image

సమాజ హితం, మానవ వికాసం కోసం రుషులు హిందూ ధర్మంలో 16 సంప్రదాయాలను సంస్కారాలుగా గుర్తించారు. అవి.. 1. పెళ్లి, 2. గర్భాధారణ, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశన, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణ, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం, 13. కర్ణభేదం, 14. విద్యారంభం, 15. వేదారంభం, 16. అంత్యేష్టి.
ఈ షోడశ సంస్కారాల విశిష్టతను ఒక్కో రోజు ఒక్కోటిగా తెలుసుకుందాం.