News March 21, 2024
పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం: TDP
AP: ‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీ’నే అంటూ వైసీపీ చేసిన <<12895964>>విమర్శలకు<<>> తెలుగు దేశం Xలో కౌంటర్ ఇచ్చింది. ‘పవన్‌ను పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది.. అది పూడ్చుకో ముందు. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్’ అని మండిపడింది.
Similar News
News September 15, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొట్టనున్నాం: షమీ
ఆస్ట్రేలియాపై BGT సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టనుందని టీమ్ ఇండియా బౌలర్ షమీ జోస్యం చెప్పారు. ‘ఇండియాయే ఫేవరెట్. అందులో డౌట్ లేదు. ప్రత్యర్థి ఆసీస్ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. కానీ గెలుస్తాం’ అని పేర్కొన్నారు. కమ్ బ్యాక్ విషయంలో తాను కంగారు పడటం లేదని తెలిపారు. ‘పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టాలి. లేదంటే మళ్లీ ఇబ్బంది పడాలి. ఎంత ఫిట్ అయితే అంత మంచిది’ అని వివరించారు.
News September 15, 2024
ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి
ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్‌మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్‌రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్‌లో వివరించారు.
News September 15, 2024
488 జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (SEP 16) ముగియనుంది. రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ కానున్న ఈ పోస్టులకు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) చేసిన వారు అర్హులు. వయసు ఓసీలకు 42 ఏళ్లు , మిగతా వారికి 47 ఏళ్లు మించకూడదు. పూర్తి వివరాల కోసం <