News February 22, 2025
అమరావతి పనులు ఆలస్యం?

AP: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభంలో స్వల్ప జాప్యం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టెండర్లు పిలిచినా వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు 62 పనులకు CRDA, ADC టెండర్లను ఆహ్వానించాయి. రూ.40వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
Similar News
News September 17, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.
News September 17, 2025
బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఎంత నష్టపోయేది?

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.
News September 17, 2025
BlackBuck సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

AP: బెంగళూరు నుంచి తమ ఆఫీసును తరలించాలని అనుకుంటున్నట్లు BlackBuck సంస్థ CEO రాజేశ్ పెట్టిన పోస్టుకు మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ కంపెనీని వైజాగ్‌కు రీలొకేట్ చేసుకోవాలని కోరారు. ఇండియాలో టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో వైజాగ్ ఒకటని పేర్కొన్నారు. ‘ఆఫీసుకి వచ్చి వెళ్లేందుకు 3hr+ పడుతోంది. 9 ఏళ్లుగా ORR ఆఫీస్+ఇల్లుగా మారింది. ఇక ఇక్కడ ఉండలేం. రోడ్లు గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి’ అని రాజేశ్ పేర్కొన్నారు.