News February 22, 2025

అమరావతి పనులు ఆలస్యం?

image

AP: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభంలో స్వల్ప జాప్యం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టెండర్లు పిలిచినా వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు 62 పనులకు CRDA, ADC టెండర్లను ఆహ్వానించాయి. రూ.40వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Similar News

News March 19, 2025

సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?

image

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్‌లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్‌ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.

News March 19, 2025

సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

image

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్‌, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్‌గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్‌లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

News March 19, 2025

సునీత విషయంలో రాజకీయం!

image

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్‌లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్‌కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

error: Content is protected !!