News February 22, 2025

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

image

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.

Similar News

News February 23, 2025

రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది.. కానీ

image

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా దొంగలకు ₹4.5Cr లాటరీ తగిలింది. అయితే చోరీ చేసిన ATM కార్డుతో దాన్ని కొనడంతో అరెస్టు భయంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. లాటరీని సమంగా పంచుకునేందుకు ఒప్పుకుంటే కేసును ఉపసంహరించుకుంటానని కార్డు యజమాని ప్రకటించాడు. విజేత వస్తే డబ్బు ఇస్తామంటూ నిర్వాహకులు నిరీక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. ఎవరూ రాకపోతే ప్రభుత్వానికి సొమ్ము వెళ్తుంది.

News February 23, 2025

ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

image

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.

News February 23, 2025

సీఎం రేవంత్‌కు ఫోన్ చేసిన రాహుల్

image

TG: SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న రాహుల్, సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గర కాంట్రాక్టర్, ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై చర్చిస్తున్నారు.

error: Content is protected !!