News February 22, 2025
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.
Similar News
News March 20, 2025
రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.
News March 20, 2025
గ్రోక్ బూతులు.. వివరణ కోరిన కేంద్రం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో AI చాట్‌బాట్ (గ్రోక్) సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతకర రీతిలో బూతు రిప్లైలు ఇచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది.
News March 20, 2025
ఫ్రీ బస్సు స్కీమ్ ఉండాలా? వద్దా?

APలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల వస్తోన్న ఇబ్బందులను చూస్తున్నామని, ఉచిత పథకాలను ప్రోత్సహించవద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం జిల్లా పరిధిలోనే ఫ్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యనూ పెంచుతోంది. దీనిపై మీ కామెంట్?