News February 24, 2025
హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

పాక్తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 24, 2025
కివీస్ గెలిస్తే పాకిస్థాన్ ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా ఒకటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఈ గేమ్ గెలిస్తే సెమీస్ బెర్తులు తేలిపోనున్నాయి. ఆ జట్టుతో పాటు ఇండియా చెరో 4 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్, బంగ్లా ఇంటిదారి పడతాయి. కివీస్ ఓడితే ఆ రెండు జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయి.
News February 24, 2025
ఆ మందులపై నిషేధం విధించిన డీసీజీఐ

పెయిన్ కిల్లర్లుగా ఉపయోగించే టపెంటడాల్, కారిసొప్రాడల్ మందుల మిశ్రమ ఉత్పత్తి, ఎగుమతులను నిషేధిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన ఓ సంస్థ ఆమోదం లేని మందుల్ని తయారు చేసి పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తోందనే కథనాల ఆధారంగా తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కాంబినేషన్లో ఉత్పత్తి చేసేందుకు ఇచ్చిన లైసెన్స్లు, NOCని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
News February 24, 2025
రేపు పులివెందులకు YS జగన్

AP: మాజీ సీఎం, YCP అధినేత వైఎస్ జగన్ రేపు పులివెందుల వెళ్లనున్నారు. బుధవారం అక్కడ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. గురువారం పులివెందులలో జరిగే LV ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని YCP వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని YCP నిర్ణయం తీసుకోగా, జగన్ వెళ్లే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.