News February 24, 2025
హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

పాక్‌తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 27, 2025
డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 27, 2025
ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.
News March 27, 2025
డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’

అత్యధిక అక్షరాస్యులున్న కేరళను డ్రగ్స్ భూతం వేధిస్తోంది. దాన్ని అంతం చేయడంలో GOVT విఫలమవుతోంది. తాజాగా పంజాబ్‌ను దాటేసి దేశంలోనే No.1 డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా మారింది. 2021లో 5,696గా ఉన్న NDPS కేసులు 2024లో 27,701కి చేరుకున్నాయి. పంజాబ్ (9,025)తో పోలిస్తే ఇవి 3 రెట్లు ఎక్కువ. 2021కి ముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇవి 87,101కు చేరాయి. ఏకంగా 130% పెరిగాయి.