News February 24, 2025
‘ఛావా’ సంచలనం

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ బాలీవుడ్‌లో రూ.100 కోట్లపైన వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ రూ.128 కోట్లు వసూలు చేయగా, ‘ఛావా’ రూ.109 కోట్లు రాబట్టినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News February 24, 2025
నాని ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్ వచ్చింది. నాని బర్త్ డే సందర్భంగా ‘RAW STATEMENT’ పేరుతో మార్చి 3న స్పెషల్ వీడియో లేదా ఫొటోను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News February 24, 2025
వంశీపై కేసుల విచారణకు సిట్ ఏర్పాటు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయనపై పలు కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై జి.వి.జి అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో ప్రత్యేక SITను నియమిస్తూ జీవో జారీ చేసింది. వంశీ వల్ల రూ.195 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
News February 24, 2025
రేవంత్ చుట్టూ భజనపరులు: అంజన్ కుమార్ యాదవ్

TG: సీఎం రేవంత్ చుట్టూ భజనపరులు ఉన్నారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో రేవంత్‌ను సొంత కులం నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు రేవంత్‌ను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. దానం నాగేందర్ వల్లే సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఓడింది. నేను పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లం’ అని ఆయన వ్యాఖ్యానించారు.