News February 24, 2025
‘ఛావా’ సంచలనం

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ బాలీవుడ్‌లో రూ.100 కోట్లపైన వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ రూ.128 కోట్లు వసూలు చేయగా, ‘ఛావా’ రూ.109 కోట్లు రాబట్టినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News March 21, 2025
IPL: కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగలరా?

రేపటి నుంచి అతిపెద్ద క్రికెట్ పండుగ IPL మొదలు కానుంది. ఈ టోర్నీలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ గెలుచుకునేదెవరనే దానిపై క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే కోహ్లీపై ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా? అనేదానిపై చర్చ జరుగుతోంది. కోహ్లీ 2016 IPLలో 973 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గిల్ (890), బట్లర్(863), వార్నర్(848) ఉన్నారు. కోహ్లీ రికార్డును ఎవరు బ్రేక్ చేయగలరు? COMMENT?
News March 21, 2025
వామ్మో.. లండన్ కాదు దొంగల డెన్!

లండన్ అనగానే చక్కటి అందాలు మనకు గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా లండన్ చోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన ఏడాది కాలంలో 83వేల ఫోన్లు చోరీకి గురయ్యాయి. లండన్ వీధుల్లో చేతుల్లో ఫోన్ పెట్టుకుని నడిస్తే ఇక ఫోన్ పోయినట్లేనని స్థానికులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గడచిన వారంరోజుల్లో 230మంది దొంగల్ని అరెస్ట్ చేశారు.
News March 21, 2025
APPSC పరీక్షల తేదీలు ప్రకటన

AP: పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు <