News February 24, 2025
అసంతృప్తికరంగా రేవంత్ పాలన: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో 14 నెలల రేవంత్ ప్రభుత్వ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రొటీన్‌గా చెల్లించాల్సిన బిల్లుల్లో సీలింగ్ పెట్టడం దారుణమన్నారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం తీరు బాగాలేదన్నారు.
Similar News
News December 30, 2025
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు షాక్

చండీగఢ్ కన్జూమర్ కోర్టు Star హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ సర్జరీకి ₹2.25 లక్షలు ఖర్చవగా Star ₹69K ఇచ్చి మిగతాది మినహాయింపు అని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్తే రూల్స్ ఒప్పుకునే పాలసీ తీసుకున్నారని Star వాదించింది. దీంతో కండిషన్స్ కాపీపై వారి సంతకాలేవి? షరతులు క్లెయిమ్ టైంలోనే చెబుతారా? అని కోర్టు మండిపడింది. మొత్తాన్ని 9%వడ్డీతో, మానసిక వేదనకు మరో ₹20K ఇవ్వాలని ఆదేశించింది.
News December 30, 2025
NIT వరంగల్‌లో 45 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 30, 2025
అక్షితలతో ఇలా చేస్తే ‘ధన లాభం’

అక్షితలతో పాటించే ఓ పరిహారంతో ధన లాభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ‘21 బియ్యం గింజలకు పసుపు రాసి, ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి వద్ద పూజించి బీరువాలో దాచుకోవాలి. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే, సోమవారం రోజున కొంత బియ్యాన్ని శివుడి వద్ద ఉంచి, అందులో గుప్పెడు బియ్యంతో స్వామిని అర్చించి, మిగిలినవి పేదలకు దానం చేయాలి. ఫలితంగా గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి’ అంటున్నారు.


